శ్రీవిష్ణు టాలెంటెడ్ యాక్టర్: రాజమౌళి

107
rajamouli
- Advertisement -

శ్రీవిష్ణు టాలెంటెడ్ యాక్టర్ అని కొనియాడారు దర్శకుడు రాజమౌళి. చైతన్య దందులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు, కేథరీన్ జంటగా నటించిన చిత్రం భళా తందనాన రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం ఘనంగా జరుగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి…దర్శకుడు చైతన్య చిన్న సినిమా చేసినా, పెద్ద సినిమా చేసినా పెద్ద సినిమా చేస్తున్నాననే యాటిట్యూడ్‌తో పనిచేస్తారని తెలిపారు. ఒక్క బాణం సినిమాలోనే కాదని.. తాను భళా తందనాన సినిమా కూడా చూశానని.. ఈ సినిమా చాలా బాగుందన్నారు.

శ్రీవిష్ణు ఏ పాత్రలోకి అయినా ఈజీగా పరకాయ ప్రవేశం చేస్తాడని.. మాస్ హీరోగానూ అతడు మౌల్డ్ అవుతాడడని కొనియాడారు. తెలుగులో ఇలాంటి జోనర్ ఉన్న ఏకైక హీరో శ్రీ విష్ణు మాత్రమే అని…ఈ సినిమా బాగా ఆడుతుందనే నమ్మకంతో థియేటర్లలో విడుదల చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -