జానకి రామ్‌తో శ్రీవిష్ణు

6
- Advertisement -

హీరో శ్రీవిష్ణు సామజవరగమన, ఓం భీమ్ బుష్‌’ వరుస బ్లాక్‌బస్టర్స్ తో అద్భుతమైన ఫామ్ లో వున్నారు. కొన్ని ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌లకు సైన్ చేసిన శ్రీవిష్ణు ఈ రోజు తన 19వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించనున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP, విజిల్ వర్తీ ఫిల్మ్స్ & KFC ప్రొడక్షన్ నంబర్ 1గా అనూష ద్రోణవల్లి, సీతా కుమారి కొత, గోపాలం లక్ష్మీ దీపక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి, ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

#SreeVishnu19 ఈరోజు తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా, పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో ఘనంగా ప్రారంభమైయింది. నవీన్ యెర్నేని, నందిని రెడ్డి, కిషోర్ తిరుమల స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. దిల్ రాజు క్లాప్‌ కొట్టగా, అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కి వివి వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తం వేడుకకు సాహు గరిపాటి, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, శరత్ మరార్, సితార నాగ వంశీ, బివిఎస్ రవి, తదితరులు హాజరయ్యారు.

మూవీ లాంచింగ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజున ఈ సినిమా ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది. ఫస్ట్ టైం బాబీ గారు ప్రొడక్షన్ లోకి రావడం చాలా ఆనందంగా వుంది. అలాగే కోనగారు, కృష్ణ గారికి ధన్యవాదాలు. ఇది చాలా డిఫరెంట్ స్క్రిప్ట్. డీవోపీ సాయి శ్రీరామ్, విజయ్ బులగానిన్ మ్యూజిక్. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, రైటర్స్ భాను, నందు.. టీం అంతా బాగా కుదిరింది. ఈ సినిమాతో జానకి రామ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నందు చాలా అనందంగా వుంది. చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా అందరికీ కూడా ఆహ్లాదకరమైన సినిమా ఇస్తామని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

శ్రీవిష్ణు డిఫరెంట్ జానర్ సినిమాలు చేయడంతో పాటు ప్రతి సినిమాలో తగిన వినోదం ఉండేలా చూసుకుంటున్నారు. #SreeVishnu19 మరొక ఆసక్తికరమైన థీమ్‌తో కూడిన ఫన్ ఫిల్డ్ ఎడ్వంచర్. భాను భోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్ రాస్తున్నారు.సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, విజయ్ బులగానిన్ సంగీతం అందించనున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, నారిని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేయనున్నారు.

Also Read:అభిషేక్ నామా… ‘నాగబంధం’

- Advertisement -