వైసీపీ ఎంపీకి ఠాగూర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌..

104
tagore
- Advertisement -

నేపాల్‌ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం రాహుల్‌పై విమర్శలు గుప్పించారు.

చైనా దౌత్యవేత్తలతో కలిసి నేపాల్ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ పార్టీ చేసుకుంటున్న వీడియోతో చైనా హనీ ట్రాప్‌లు పెరుగుతుండడం కలవరపెడుతోందన్న ఆయన.. నేపాల్‌లోని చైనీస్ రాయబారి హౌ యాంకీ రాహుల్ గాంధీతో ఉన్నారని పేర్కొన్నారు. సాయిరెడ్డి ట్వీట్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ ఠాగూర్.

అవినీతి విజయసాయిరెడ్డి.. మీ సమస్య జగన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులని మాకు తెలుసు.. కానీ నిజం మర్చిపోకండి.. నేపాల్ అంబాసిడర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ నేపాల్ వెళ్లారని క్లారిటీ ఇచ్చారు. రాహుల్‌ గాంధీ వివాహ వేడుకకు హాజరుకావడంలో తప్పేముంది? పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బర్త్ డేకు ఎలాంటి ఆహ్వానం లేకుండానే నరేంద్ర మోడీ వెళ్లినట్లు.. రాహుల్ వెళ్లలేదు కదా? అంటూ మండిపడ్డారు.

- Advertisement -