నిఖిల్‌ 20 @ శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్

157
nikhil
- Advertisement -

‘అర్జున్ సుర‌వ‌రం’ లాంటి హిట్‌తో స‌క్సెస్‌లో ఉన్న ప్రామిసింగ్ యంగ్ హీరో నిఖిల్ త‌న‌ 20వ చిత్రాన్ని అఫిషియ‌ల్‌గా అనౌన్స్‌ చేశారు. ఈ సినిమాని శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియ‌న్ గ్రూప్ యూనిట్‌) బ్యాన‌ర్‌పై నారాయణ్‌దాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు సంయుక్తంగా నిర్మించ‌నుండ‌గా, సోనాలీ నారంగ్ స‌మ‌ర్పించ‌నున్నారు. ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను రెయిన్‌బో రీల్స్ చూసుకోనుంది.

నిఖిల్ కెరీర్‌లో మ‌ర‌పురాని చిత్రంగా నిలిచే ఈ మూవీని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి ప‌నిచేసే ద‌ర్శ‌కుడు, తారాగ‌ణం, ఇత‌ర సాంకేతిక బృందం వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు. నిఖిల్ ప్ర‌స్తుతం చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ‘కార్తికేయ 2′, ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ డైరెక్ష‌న్‌లో ’18 పేజెస్’ చిత్రాలు చేస్తున్నారు.

మ‌రోవైపు, నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్‌లో ‘ల‌వ్ స్టోరి’ సినిమాని ఏషియ‌న్ సినిమాస్ నిర్మిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా త‌యార‌వుతున్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది.

- Advertisement -