గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న శ్రేయా రావు కామవర్పు

204
gic
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఫెమినా మిస్ ఇండియా రన్నర్ అప్- శ్రేయా రావు కూకట్ పల్లి లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. యువ నటి సిమ్రాన్ చౌదరి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు.

ఇంతటి పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో, దీనిని ముందుకు తీసుకుపోయేందుకు, తనతో పాటు ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న వారికి మరియు ప్రముఖులకు మూడు మొక్కలు నాటమని ఛాలెంజ్ చేశారు. వారిలో ప్రముఖ హీరో సందీప్ కిషన్ , నటి మానుషీ చిల్లర్ , ఆర్టిస్ట్ శ్రీనిధి శెట్టి, యాక్టర్ ఆశా భట్ , , మ్యూజీషియన్ , సింగర్ బెహ్రమ్ సిగన్పోరియ , మిష్టర్ చాంగ్, మీనాక్షీ చౌదరి, యాక్టర్ ప్రియ, ప్రముఖ మోడల్ రోష్ని షెరోన్, గాయత్రి భరద్వాజ్ , నేహాల్ చూధాస్మా , స్టెఫీ పాటిల్, షెఫాలిసూద్ , భావనా దుర్గం , నికితా శర్మ ఉన్నారు.

- Advertisement -