యంగ్ బ్యూటీ శ్రీలీలకి బంపర్ ఆఫర్ దక్కింది. కానీ, ఆమెకి ఇంకా టెన్షన్ పోవడం లేదు. ఇప్పటివరకు శ్రీలీల కు భారీ బ్రేక్ రాలేదు. ఇలాంటి సమయంలో ఆమెకు ఏకంగా బాలయ్యతో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. కాకపోతే హీరోయిన్ పాత్రలో కాదు, కూతురు పాత్రలో. పేరుకు కూతురు పాత్ర అయినా.. శ్రీలీల పాత్ర సినిమాలోనే చాలా కీలకం. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఇంతటి మంచి అవకాశాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెకు ఇచ్చాడు.
పైగా అనిల్ రావిపూడి బాలయ్య సినిమాను ఇటీవలే స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. ఐతే, ఇప్పటివరకు శ్రీలీల పేరుని ప్రకటించలేదు. బాలకృష్ణ ఓకే చెప్తే కానీ అటు అనిల్ రావిపూడి కానీ, ఇటు నిర్మాత కానీ అధికారికంగా ప్రకటించలేరు. మరి బాలయ్య శ్రీలీలకు అవకాశం ఇస్తాడా ?, ఇక్కడే పెద్ద అడ్డంకి. ఇంకా శ్రీలీల ను కూతురు పాత్రలో తీసుకునేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
అందుకే, ఇప్పటివరకు శ్రీలీల పేరుని అనౌన్స్ చెయ్యలేదు. మొత్తానికి ఛాన్స్ వచ్చినా ఆమెకి టెన్షన్ వీడలేదు. మరోపక్క రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా వచ్చిన ధమాకా చిత్రం బాక్సాఫీస్ దగ్గర అడ్డంగా దొరికిపోయింది. కాబట్టి.. శ్రీలీల కెరీర్ మళ్లీ మొదటికి వచ్చింది. ఇలాంటి సమయంలో ఆమెకు బాలయ్య సినిమా చాలా కీలకం. మరి బాలయ్య ఏం చేస్తాడో ? చూడాలి.
ఇవి కూడా చదవండి..