గయాలో కోవిడ్‌ కలకలం…

244
corona
- Advertisement -

గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మరోసారి తన పంజాను విసరబోతుంది. తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా ముఖ్యంగా చైనాలో కరోనా విజృంభిస్తున్న వేళ భారత్ అప్రమత్తమైంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అలర్ట్ జారీ చేసింది.

ఒమిక్రాన్ బీఎఫ్ 7రకం కరోనా వైరస్ భారత్‌లోనూ వెలుగు చూసింది. తాజాగా బీహార్‌లోని గయా వద్ద నలుగురు విదేశీయులకు కోవిడ్ పాజిటివ్ రావడంతో బీహార్ అ ప్రమత్తమైంది. వారిలో ఒకరు మయన్మార్ నుంచి రాగా, మరొకరు థాయ్‌లాండ్‌, ఇద్దరు ఇంగ్లాండ్‌ నుంచి వచ్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పాజిటివ్‌ తేలిన వారిని గయలోని ఓ హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచినట్లు గయ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రంజన్‌ సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగానే ఉన్నారని.. వైరస్‌ ఇతరులకు వ్యాపించకుండా ఐసోలేషన్‌లో ఉంచి తగిన ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నట్లు వివరించారు.

ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఈ మేరకు పండుగలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. పండుగల వేళ భౌతిక దూరాన్ని పాటించాలని మాస్క్‌ శానిటైజర్ తప్పనిసరి చేసింది. దీంతో పాటుగా దేశంలోని అన్ని అసుపత్రుల వద్ద ఆక్సిజన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రాలకు సూచనలు జారీ చేశారు.

విమానాశ్రయాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ఇతర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ తేలిన వారిని వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

నేటి బంగారం, వెండి ధరలివే

భారత్ కరోనా అప్‌డేట్..

పాదాల పగుళ్ళకు చిట్కాలు..

- Advertisement -