‘ఎస్‌ఆర్‌ క‌ళ్యాణ‌మండ‌పం’ రివ్యూ..

624
- Advertisement -

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’. చాన్నాళ్ల కిందటే సినిమా పూర్తయినా కరోనా నేపథ్యంలో విడుదల ఆలస్యమైంది. టీజర్.. ట్రైలర్లతో యువతను బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రోమోల మాదిరే సినిమా కూడా ఆకట్టుకునేలా ఉందో లేదో చూద్దాం.

క‌థ: ఆ ఊళ్లో ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ‌మండ‌పానిది ఓ చ‌రిత్ర. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత త‌న‌యుడు ధ‌ర్మ (సాయికుమార్‌) ఆ మండ‌పం బాధ్యత‌ల్ని తీసుకుంటాడు. కాల‌క్రమంలో మండ‌పం వైభ‌వం త‌గ్గుతుంది. అందుకు కార‌ణం ధ‌ర్మనే అని ఊళ్లోవాళ్లు చెప్పుకుంటుంటారు. భార్య శాంతి(తుల‌సి)తో ధ‌ర్మకి ఎప్పుడూ త‌గ‌వులే. దాంతో తాగుడుకి బానిస‌వుతాడు. ధ‌ర్మ త‌న‌యుడు క‌ళ్యాణ్ (కిర‌ణ్ అబ్బవ‌రం) కూడా త‌న తండ్రితో మాట్లాడ‌టం మానేస్తాడు. తాక‌ట్టు వ‌ర‌కు వెళ్లిన ఎస్‌.ఆర్.క‌ళ్యాణ‌మండపానికి పూర్వవైభ‌వం తీసుకొచ్చే బాధ్యత క‌ళ్యాణ్‌పై ప‌డుతుంది. మరి అందులో క‌ళ్యాణ్ విజ‌యం సాధించాడా లేదా? అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్.. కిర‌ణ్ అబ్బవ‌రం, సాయికుమార్ పాత్రలు ఆక‌ట్టుకుంటాయి. ప్రథ‌మార్ధంలో భావోద్వేగాలు, వినోదం, మ‌లుపులు ఫ‌లితాన్నిచ్చాయి. క‌ళ్యాణ‌మండ‌పం బాధ్యత‌లు మీద ప‌డ‌టం.. దాంతో హీరో, అత‌ని మిత్రబృందం తెలివితేట‌లు జోడించి పెళ్లిళ్లు చేయాల‌ని నిర్ణయించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. పెళ్లిళ్లు గతంలో ఎలా జ‌రిగేవి, ఇప్పుడెలా జ‌రుగుతున్నాయో హీరో చెప్పడం ఆక‌ట్టుకుంటుంది.

మైనస్‌ పాయింట్స్‌:

ద‌ర్శకుడు శ్రీధ‌ర్ గాదే క‌థ‌పై ప‌ట్టుని ప్రద‌ర్శించ‌లేక‌పోయాడు. ఒక క‌ళ్యాణ‌మండ‌పాన్ని కూడా చూపించ‌లేని స్థాయిలో నిర్మాణ విలువ‌లు ఉన్నాయి. దీంతో క‌ళ్యాణ‌మండ‌పం క‌ళ త‌ప్పిన‌ట్టైంది. ఇక ద్వితీయార్ధంలో క‌థ పూర్తిగా దారి త‌ప్పిన‌ట్టవుతుంది. కిరణ్ అబ్బవరపు ఏమనుకుని ఈ కథను మొదలుపెట్టాడో కానీ.. ప్రేక్షకులను కట్టిపడేసేలా ఇందులో ఏమీ లేదు. ఏం తోస్తే అది రాసి సినిమా తీసేసినట్లు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా బాగుంది. చేత‌న్ భ‌రద్వాజ్ పాట‌లు, నేప‌థ్య సంగీతం, డేనియ‌ర్ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్రధాన‌బ‌లంగా నిలిచాయి. ప్రొడక్షన్ పరంగా అంత క్వాలిటీ కనిపించదు సినిమాలో. ఎడిటింగ్ ఈ సినిమాకు పెద్ద మైనస్. చాలా సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. దర్శకత్వ పరంగా శ్రీధర్ నిరాశపరిచాడు. ఒక కొత్త దర్శకుడి నుంచి ఆశించే కొత్తదనం ఇందులో ఏమీ కనిపించదు.

తీర్పు:

‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో విశేషాలేమీ లేవు.

విడుద‌ల తేదీ: 06-08-2021
రేటింగ్: 2/5
న‌టీన‌టులు: కిర‌ణ్ అబ్బవ‌రం, ప్రియాంక జ‌వాల్కర్
సంగీతం: చేత‌న్ భ‌ర‌ద్వాజ్
నిర్మాత‌లు: ప్రమోద్, రాజు
ద‌ర్శకుడు: శ్రీధ‌ర్ గాదే

- Advertisement -