విండీస్ పర్యటనకు టీమిండియా జట్లు ఖరారు..

123
team-india-

వరల్డ్ కప్ తర్వాత మరో సిరీస్ కు రెడీ అవుతోంది టీం ఇండియా. ఆగస్ట్ 3నుంచి వెస్టీండిస్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ లు ఆడనుంది. ఈ పర్యటనకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనే మూడు ఫార్మాట్లకు సారథిగా వ్యవహరించనున్నాడు. గాయంతో వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ టీ20, వన్డే జట్లలో చోటు దక్కించుకున్నాడు. ఈ పర్యటనలో పాల్గొనే టీమిండియా జట్టును సెలెక్టర్లు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. వన్డేలు, టీ20లకు రోహిత్‌ శర్మ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. టెస్టుల్లో వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలను రహానెకు ఇచ్చారు.

టెస్ట్‌ జట్టు..
కోహ్లీ (కెప్టెన్‌), రహానె (వైస్‌ కెప్టెన్‌) మయాంక్‌, రాహుల్‌, పుజారా, రోహిత్‌ శర్మ, విహారి, పంత్‌, సాహా, అశ్విన్‌, జడేజా, కుల్‌దీప్‌, ఇషాంత్‌, షమీ, బుమ్రా, ఉమేశ్‌

వన్డే జట్టు..
కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, ధావన్‌, రాహుల్‌, పంత్‌, జడేజా, కుల్‌దీప్‌, చాహల్‌, కేదార్‌ జాదవ్‌, షమీ, భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌ సైనీ

టీ 20 జట్టు..
కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), ధావన్‌, రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌, కృనాల్‌ పాండ్య, జడేజా, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైనీ