ఇస్మార్ట్ శంకర్ మూడు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

135
ismart Shankar Collecions

టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జీటాక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈచిత్రం ఈనెల 18న గ్రాండ్ గా రిలీజ్ అయింది. పూరీ సొంత బ్యానర్ అయినటువంటి పూరీ కనెక్ట్స్ లో మూవీని నిర్మించారు. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

రామ్ ఇంతకుమందు సినిమాలకు రానంత క్రేజ్ ఈసినిమాకు వచ్చింది. గత కొంత కాలంగా ప్లాప్ లతో సతమతమవుతున్న రామ్, పూరీకి సరైన సమయంలో హిట్ పడిందని చెప్పుకోవచ్చు.. ఈ సినిమా తొలి మూడు రోజుల కలెక్షన్స్ రూ. 36 కోట్లకు పైనేనని చిత్ర యూనిట్ పేర్కొంది.

పైగా ఇవాళ ఆదివారం కావడంతో చాలా వరకు కలెక్షన్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు చిత్రయూనిట్. దీంతో తొలి వారంలోనే సినిమా కలెక్షన్లు రూ. 50 కోట్ల మార్క్ ను దాటుతాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మణిశర్మ మ్యూజిక్ ఈసినిమాకు హైలెట్ గా నిలిచిందని చెబుతున్నారు.