బీజేపీలో సంచలన మార్పులకు కారణం అదే.. !

37
- Advertisement -

బీజేపీలో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి ప్రక్షాళన అవసరమని భావించిన అధిష్టానం మార్పులు చేయక తప్పలేదు. గత వారం రోజులుగా బీజేపీ సంస్థాగత మార్పులపై వార్తలు వస్తున్న నేపథ్యంలో.. వాటన్నిటికీ తెర దించుతూ ఆయా రాష్ట్రాలలో కీలక మార్పులు చేసింది అధిష్టానం. తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించబోతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో నేడు ఎవరు ఊహించని విధంగా అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది అధిష్టానం. ఇక ఏపీ విషయంలో కూడా అధ్యక్ష పదవిలో మార్పులు చేపట్టి ఆ పదవి నుంచి సోము వీర్రాజు ను తప్పించి.. ఎవరు ఊహించని విధంగా పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది అధిస్థానం. .

అలాగే నూతన అధ్యక్షుల జాబితాలో జార్ఖండ్ కు బాబూలాల్ మారండి, పంజాబ్ కు సునిల్ జక్కర్, వంటి వారిని నియమించింది. ఇక తెలంగాణలో గత కొన్నాళ్లుగా అధ్యక్ష రేస్ లో ఉన్న ఈటెల రాజేందర్ కు ఎన్నికల కమిటీ చైర్మెన్ పదవిని కట్టబెట్టింది. కాగా అధ్యక్ష హోదా నుంచి తప్పించబడిన వారికి అనగా బండి సంజయ్, సోము వీర్రాజు వంటి వారికి తగిన ప్రదాన్యం కల్పించే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది బీజేపీ హైకమాండ్.

Also Read:తెలంగాణకు కిషన్ రెడ్డి..ఏపీకి పురందేశ్వరి

కాగా ఇంత హటాత్తుగా బీజేపీలో మార్పులు చేయడానికి కారణం.. ఎన్నికలు దగ్గర పడుతుండడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ ఏడాది చివర్లో తెలంగాణతో పాటు మద్య ప్రదేశ్, జార్ఖండ్, వంటి రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో పార్టీలోనూ అసమానతలను అధిగమించేందుకు ఇదే సరైన టైమ్ గా భావించి అధిష్టానం మార్పులు చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ మార్పులు బీజేపీకి ఎంతవరకు ప్లెస్ అవుతాయో చూడాలి.

Also Read:SRK:షారుఖ్‌కు గాయాలు

- Advertisement -