ఉపాధి హామీపై స్పీకర్ పోచారం రివ్యూ..

270
pocharam
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పథకంపై రివ్యూ నిర్వహించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. కోటగిరి, వర్ని, రుద్రూర్, చందూర్, మోస్రా మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనగా పలు కీలక సూచనలు చేశారు పోచారం.

గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సాగునీటి ఉప కాలువలు, చెరువుల ఫీడర్ చానెల్‌ల మరమ్మతులు చేయాలన్నారు. ప్రత్యేక నిధులను కెటాయించి నిజాంసాగర్ ప్రధాన కాలువను సిమెంటు లైనింగ్ చేయించాం అన్నారు.

బ్రాంచి కెనాల్ లపై దృష్టి సారించాలని…వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతున్నందున తక్షణమే కాలువలలో పూడిక, చెత్తను తొలగించే పనులను ప్రారంభించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పనులను పూర్తిచేయాలన్నారు.

ఎండలు ఎక్కువగా ఉన్నందున గ్రామాలలో మంచినీటి కొరత రాకుండా ప్రజాప్రతినిధులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

- Advertisement -