గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ముగిశాయి. చెన్నై తామరైపాకంలోని ఫాంహౌస్ లో తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య జరిగాయి. వీర శైవ జంగమ సంప్రదాయం ప్రకారం బాలూ పార్ధివదేహాన్ని ఉంచి ఖననం చేశారు. బాలు పార్థీవదేహం చూసి కన్నీళ్లతో నివాళులు అర్పించారు అభిమానులు, శ్రేయోభిలాషులు. ఎప్పుడూ చలాకీగా, నవ్వుతూ కనిపించే బాలును గుర్తుచేసుకుంటూ మిత్రులు, ఆప్తులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. మంత్రి ఎస్పీ భౌతిక కాయానికి నివాళులర్పించి..కుమారుడు ఎస్పీ చరణ్‌ను పరామర్శించారు. తమిళ హీరో విజయ్ తో పాటు టాలీవుడ్,కోలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
ఆగస్ట్ 5 నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఎస్పీ బాలు మధ్యలో కోలుకున్నట్లే అనిపించినా.. చివరికి అందరిలో విషాదాన్ని నింపి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.