యాసంగికి అందుబాటులో 10 ల‌క్ష‌ల ట‌న్నుల యూరియా…

167
Minister niranjan reddy
- Advertisement -

తెలంగాణకు కేటాయింపులకు అనుగుణంగా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కేంద్రాన్ని కోరామని తప్పకుండా సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను 2 లక్షల మెట్రిక్ టన్నులు పెంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు.

తెలంగాణలో పెరిగిన సాగునీటి వసతులు, తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా గత యాసంగి కన్నా 30 శాతం సాగు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గత యాసంగిలో 53.82 లక్షల ఎకరాలలో సాగు కాగా… మొత్తం సాగులో యూరియా అధికంగా వినియోగించే వరి, మొక్కజొన్న, ఉద్యానపంటలే 80 శాతంగా ఉందన్నారు. ఈ కారణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రాన్నికోరినట్లు నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -