- Advertisement -
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రుతుపవనాలు జూన్ ఒకటి నాటికి కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం కాస్త ముందుగానే రానున్నట్టు ఇస్రో వాతవరణ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయని అందుకే ముందస్తు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
మరోవైపు ఆగ్నేయ ఆరేబియా సముద్రంలో శుక్రవారం ఆల్పపీడనం ఎర్పడనుందని, అది బలపడి తుఫాన్ గా మారడంతో తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
- Advertisement -