మూడో వన్డేలోనూ ఓడిన భారత్‌..

137
sa
- Advertisement -

వన్డే సిరీస్‌లో భారత్‌ను వైట్ వాష్ చేసింది దక్షిణాఫ్రికా. 3-0తో భారత్‌కు చిత్తుచేసింది. భారీ విజయలక్ష్యం ముంగిట పోరాడి ఓడిపోయింది. దీపక్‌ చాహర్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54) వీరోచిత హాఫ్‌ సెంచరీతో జట్టు విజయం ఖాయమే అనుకున్నా.. అనవసర షాట్‌కు వెళ్లి వికెట్‌ సమర్పించుకోవడంతో పరిస్థితి మారింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన పోరులో 4 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయబావుటా ఎగురవేసింది.

సఫారీలు విధించిన 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌట్‌ అయింది. కోహ్లీ (65), ధవన్‌ (61) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లో ఎంగిడి, ఫెలుక్వాయోలకు మూడేసి వికెట్లు దక్కాయి.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 287 పరుగులు చేసింది. డికాక్‌ (124) శతకం సాధించగా.. డుస్సెన్‌ (52) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రసిద్ధ్‌కు మూడు, దీపక్‌.. బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. డికాక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు.

- Advertisement -