ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ..

124
ganguly
- Advertisement -

ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.ఈ మేరకు గంగూలీ పేరును ప్రకటించారు ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్కే. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడిగా… నిర్వాహకుడిగా తనకు ఉన్న అనుభవం ముందుకు వెళ్లడంలో మాకు సహాయపడుతుంది అని బార్కే ప్రకటించాడు.

ఇప్పటివరకు ఈ పదవిలో అనిల్ కుంబ్లే ఉండగా గత తొమ్మిదేళ్లుగా ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌ గా ఉండి అంతర్జాతీయ క్రికెట్ ను మెరుగుపరిచిన అనిల్‌కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు గ్రెగ్ బార్కే . 2019 అక్టోబర్ లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు గంగూలీ.

- Advertisement -