జక్కన్నకు సారీ చెప్పిన ఖాన్‌..

169
- Advertisement -

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ సినీరంగ చరిత్రలో మరే చిత్రానికీ సాధ్యం కాని మహాద్బుతాన్ని రాజమౌళి తీసిన బాహుహలి2 సృష్టించింది. బాహుబలి2పై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి2 ఏకంగా 1500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
 "Sorry Rajamouli," Says the Mouthful Critic Kamaal R Khan
దేశంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన బాహుహలి2 తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ సినీరంగ చరిత్రలో మరే చిత్రానికీ సాధ్యం కాని మహాద్బుతాన్ని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి: ది కంక్లూజన్‌’కు ప్రశంసలు దక్కుతున్న వేళ ఆ సినిమాను తీవ్రంగా విమర్శించాడు బాలీవుడ్‌ విమర్శకుడు కమాల్‌ రషీద్ ఖాన్‌. ఆ సినిమా చూడడం వల్ల డబ్బులు, టైమ్‌ వేస్ట్‌ అని, అదో చెత్త సినిమా అని వ్యాఖ్యానించాడు. అలాగే ప్రభాస్‌ ఒంటెలా ఉన్నాడని, రానా ఓ ఇడియట్‌ అని కూడా ట్విట్టర్‌ ద్వారా విమర్శించాడు.
"Sorry Rajamouli," Says the Mouthful Critic Kamaal R Khan
కమాల్‌ ఎంత విమర్శించినా బాలీవుడ్‌లో కొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ సినిమా. దీంతో తన తప్పును అంగీకరించాడు కమాల్‌ రషీద్ ఖాన్‌. రాజమౌళికి క్షమాపణ చెప్పాడు. ‘‘బాహుబలి: ది కంక్లూజన్‌’ సినిమాకు సంబంధించినంతవరకు నా తప్పుడు రివ్యూకు సారీ. ఈ సినిమా నిజంగా నాకు నచ్చలేదు. కానీ, జనాలందరికీ నచ్చింది. జనం మాట దేవుడి వాక్కుతో సమానం. అందుకే రాజమౌళికి క్షమాపణలు చెబుతున్నాన’’ని ట్వీట్‌ చేశాడు కమాల్‌ రషీద్ ఖాన్‌.

- Advertisement -