- Advertisement -
ఇవాళ పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అలాగే కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం, భారత్-చైనా సరిహద్దు వివాదం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వరద ప్రభావంతోపాటు అనేక రాష్ట్రాల్లో ఉన్న కీలక సమస్యలపై చర్చించనున్నారు.
ఢిల్లీలోని సోనియా నివాసమైన 10 జన్‌పథ్‌లో ఈ సమావేశం జరిగనుంది. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన కీలక నేతలు ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ జనరల్ సెక్రటరీలు, పీసీసీ అధ్యక్షులు, ఇతర అనుబంధ సంఘాల నేతలకు ఆహ్వానం అందింది. త్వరలో రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో యాత్ర గురించి కూడా చర్చించనున్నారు. గుజరాత్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా కాంగ్రెస్ అధిష్టానం చర్చించే అవకాశం ఉంది.
- Advertisement -