మొక్కలు నాటిన కీరవాణి

143
challenge
- Advertisement -

మనిషికి మొదటి గురువు నేలతల్లి అయితే రెండవ గురువు చెట్టు అన్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యం.యం. కీరవాణి. “మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుందంటూ” మొక్కల ప్రాధాన్యతను వివరించిన కీరవాణి.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను సంగీతమయం చేశారు. జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ జీహెచ్ఎమ్సీ పార్క్ లో ఈ రోజు కీరవాణి తన బృందంతో సింగర్స్ అరుణ్ కౌండిన్య,అమల చేబోలు, మోహన బోగరాజు,హైమత్ మొహమ్మద్,గోమతి, రాహుల్ సిప్లిగంజ్ కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్కలు నాటారు.

అనంతరం, కీరవాణి మాట్లాడుతూ.. మనం మనుషులతోనే మాట్లాడతాం, మనుషుల్నే జీవులుగా పరిగణిస్తాం. కానీ మొక్కలు మనకన్న గొప్పవి. ఏ స్వార్థం లేకుండా మన బ్రతకడానికి కావల్సిన ఆక్సీజన్ను అందిస్తాయి. మనం బ్రతకాలంటే చెట్లు కావాలి. చెట్లు కావాలంటే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో మొక్కలు నాటాలి. వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని అత్యంత ప్రేమతో కొనసాగిస్తున్న రాజ్యసభ సభ్యులు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు తన సహచరులు మణిశర్మ, సింగర్ సునితకు ఛాలెంజ్ విసురుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కీరవాణితో పాటు ఆరుగురు సభ్యుల బృందం మొక్కలు నాటారు.

- Advertisement -