పూర్తి అధికార యంత్రాంగం చేతుల్లో ఉన్న మహమ్మారి విజృంభనను కట్టడి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విఫలం అయ్యారని మండిపడ్డారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన సోనియా…కేంద్రం రాష్ట్రాలకు ఎలాంటి అదనపు ఆర్ధిక సహాయం చేయలేదన్నారు.
ప్రస్తుతం దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని తెలిపారు.ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.మరోవైపు చైనా- భారత్ సరిహద్దు వివాదం నెలకొంది.…ప్రతి సంక్షోభానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలే కారణం అన్నారు.భారీ ఆర్థిక ఉద్దీపన పథకం, పేద ప్రజల చేతుల్లోకి నేరుగా డబ్బులు వెళ్లేలా చర్యలు, ఎమ్ఎస్ఎమ్ఈ లను ఆదుకునేల చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ముడి చుమురు ధరలు పడిపోయిన వరుసగా 17 రోజులుగా ఇంధన ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరిచారని మండిపడ్డారు సోనియా. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఇతర సీడబ్ల్యూసీ సభ్యులు హాజరుకాగా సమావేశానికి ముందు గాల్వన్ ఘర్షణలో మరణించిన సైనికులకు నివాళి అర్పించారు సీడబ్ల్యూసీ సభ్యులు.