ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం..

32
congress

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన ఢిల్లీలో సీడబ్య్లూసీ సమావేశం ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎంపికతో పాటు సంస్ధాగత ఎన్నికలపై చర్చించనున్నారు.

మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని ఎన్నికల అథారిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వ‌హించేందుకు తాము సిద్ధమేనని సోనియాకు తెలుపడంతోపాటు పలు సిఫారసులు చేసిందని కాంగ్రెస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆశాజ‌న‌క ఫ‌లితాలు రాక‌పోవ‌డంతో రాహుల్ గాంధీ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు. అప్ప‌టి నుంచి సోనియాగాంధీ తాత్కాలిక‌ అధ్యక్షురాలిగా కొన‌సాగుతున్నారు.