సోనియా గాంధీ రిటైర్మెంట్ కు సిద్దమౌతున్నారా?

56
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నారా ? పార్టీని రాహుల్ గాంధీ చేతిలో పెట్టడానికి సోనియా గాంధీ రెడీ అవుతున్నారా ? సోనియా గాంధీ రిటర్మెంట్ పై ఎందుకు చర్చ జరుగుతోంది ? అనే ప్రశ్నలు ప్రస్తుతం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే ఇటీవల సోనియాగాంధీ తన రిటైర్మెంట్ పై పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ ” భారత్ జోడో యాత్ర తోనే తన పోలిటికల్ ఇన్నింగ్స్ ముగుస్తున్నట్లు వెల్లడించారు. 2004, 2009 లో డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ సాధించిన విజయాలు తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని ఇంకా ఎక్కువ సంతోషాన్నిచ్చిన విషయం ఏమిటంటే భారత్ జోడో యాత్ర తోనే తన రాజకీయ ఇన్నింగ్స్ ముగుస్తుందని, పార్టీకి ఇదొక కీలక మలుపు అవుతుందని ” ఆమె చెప్పుకొచ్చారు.

దీంతో ఆమె పాలిటిక్స్ నుంచి తప్పుకునేందుకు సిద్దమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. రరాజీవ్ గాంధీ మరణాంతరం పార్టీ బాద్యతలను తన భుజానికెట్టుకున్న సోనియా గాంధీ.. పార్టీలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలకడంతో పాటు, పార్టీని బలమైన శక్తిగా మార్చడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. అయితే వయసు పైబడడంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఆమెను చుట్టుముట్టినప్పటికి.. పార్టీలో మాత్రం క్రియాశీలకంగానే వ్యవహరిస్తూ వచ్చారు. ప్రస్తుతం 76 సంవత్సరాల సోనియా గాంధీ.. గత కొన్నాళ్లుగా పార్టీ బాద్యతల విషయంలో తర్జనభర్జన పడుతూనే ఉన్నారు. కొడుకు రాహుల్ గాంధీ అస్థిర నిర్ణయాల కారణంగా గతంలోనే రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సోనియా.. తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు.

అయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ గతంతో పోలిస్తే రాజకీయాల్లో తన మార్క్ కనబరుస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు దేశ ప్రజల నుంచి మంచి ఆధారణ లభించింది. అంతే కాకుండా పార్టీకి కూడా మైలేజ్ తీసుకొచ్చింది. దీంతో రాహుల్ ఎదుగుతున్న తీరు పట్ల సోనియా గాంధీ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇదే సరైన సమయం అని ఆమె త్వరలోనే పార్టీ పరమైన అన్నీ బాద్యతలు రాహుల్ గాంధీకి అప్పగించి తాను విశ్రాంతి తీసునునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మల్లికార్జున్ ఖర్గే పనితీరు కూడా బాగుండడంతో సోనియా గాంధీ రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి సోనియా గాంధీ ఎప్పుడు రిటైర్మెంట్ తరువాత కూడా పార్టీకి అండగా ఉంటారా లేదా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ చేతుల్లోకి టీడీపీ.. చంద్రబాబు సిద్ధమేనా?

అదానీ తీరుపై మోదీ మౌనం వీడాలి:కవిత

ఇరాన్‌…ట్రంప్‌ను చంపేస్తాం..!

- Advertisement -