ఆస్పత్రి నుండి సోనియా డిశ్చార్జ్

2
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలోని సర్‌ గంగా రామ్‌ ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యారు. గురువారం ఆమె అస్వస్థతకు గురవ్వడంతో నిన్న ఉదయం ఢిల్లీలోని గంగా రామ్‌ ఆసుపత్రిలో చేరారు.

సోనియా గాంధీ పొత్తి కడుపు సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఈరోజు మధ్యాహ్నం డిశ్చార్జ్‌ చేశారు.

Also Read:LRS పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్!

- Advertisement -