అమెరికా దిగ్గజ ఈవీ కంపెనీ టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు వేగంగా ఏర్పాట్లు చేపడుతోంది. ఇప్పటికే భారత్‌లో నియామక ప్రక్రియను ప్రారంభించి, షోరూంల ఏర్పాటుపై ప్రయత్నాలు ప్రారంభించింది.
దీనిపై మాట్లాడిన ట్రంప్.. భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు అన్యాయమే అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు మమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారత ప్రభుత్వం సుంకాల ద్వారా లాభపడాలని చూస్తోందన్నారు. మస్క్‌కు అది లాభదాయకమై ఉండొచ్చు… కానీ అమెరికా పరంగా చూస్తే మాత్రం అది అన్యాయం అన్నారు ట్రంప్.
టెస్లా ఈ ఏడాది ఏప్రిల్ నుండి టెస్లా విక్రయ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.కనీసం $500 మిలియన్ (సుమారు ₹4,100 కోట్లు) పెట్టుబడి పెట్టిన సంస్థలకు దిగుమతి సుంకాలను 15%కి తగ్గించే విధానం తీసుకురాబోతోంది. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా – భారత వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:కోమటిరెడ్డి మనిషిలా మాట్లాడటం లేదు!

