ప్రతి ఒక్కరికి ఆయనే స్ఫూర్తి

105
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరిని స్ఫూర్తిగా నిలిచేలా పనిచేస్తారని ఆపార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్‌కు గత వైభవం తేవడంలో ఖర్గే తనదైన శైలిలో పనిచేస్తారని అన్నారు. ఆయన ఎంతోఅనుభవం కలిగిన వ్యక్తి అని కష్టించే తత్వంతో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్ష స్థాయికి ఎదగడం గొప్ప విషయమన్నారు. గాంధీ కుటుంబం తర్వాత కాంగ్రెస్‌కు ఖర్గేను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

ఖర్గే నాయకత్వంలోని పార్టీ మరింత బలోపేతమవుతుందన్న సోనియా.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా పెద్ద బాధ్యత అని అన్నారు. తాను ఆ విధులను చిత్తశుద్ధితో, తన సామర్థ్యం మేరకు నిర్వర్తించడానికి ప్రయత్నించానని ఈ సందర్భంగా సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు.

ఖర్గే సవాళ్లను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నట్టు విశ్వాసం వ్యక్తం చేశారు. దానికి తమ పూర్తి సహాయ, సహకారాలుంటాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పదవీ పగ్గాలు చేపట్టిన ఖర్గేకు సోనియా అభినందనలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌ చీఫ్‌గా ఖర్గే..బాధ్యతలు స్వీకరణ

మునుగోడుతో స్వార్ధ రాజకీయాలకు చెక్‌..

దెబ్బలు తిన్న సీఎం ఎక్కడో తెలుసా…

- Advertisement -