హోంగార్డుల నియామకాలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దన్నారు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. హోంగార్డుల నియామకాలకు సంబంధించి ఏదైనా షెడ్యూల్ ఉంటే ముందు గా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటిస్తామని.. పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని డీజీపీ ట్వీట్ చేశారు. తప్పుడు వార్తలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు.
సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దన్నారు. హోం గార్డుల నియామకాలు జరుగుతున్నాయంటూ ఎవరో తప్పు డు వార్తలు ప్రచారం చేస్తున్నారని, ఆ వార్త ఫేక్ అని తొలుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ట్వీట్ చేశారు. దాన్ని కోట్ చేస్తూ డీజీపీ కూడా ట్వీట్ చేశారు. ఎవరైనా తాము ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
If any Selection / Recruitment process is scheduled, first official notification will be published through print and electronic media, @ all our official Social Media accounts.
Please do verify before being victimized by believing someone else. https://t.co/mTjbIUDnKs— DGP TELANGANA POLICE (@TelanganaDGP) November 23, 2019