ఓటరు లిస్ట్‌లో స్మృతి ఇరానీ పేరు మాయం

3
- Advertisement -

బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీకి బిగ్ షాక్ తగిలింది. ఓటర్ లిస్ట్‌లో ఆమె పేరు మాయమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేది నుండి 2019లో ఎంపీగా ఎన్నికయ్యారు స్మృతి.

మేదాన్ మావయ్ గ్రామంలో సొంత ఇల్లు నిర్మించుకుని అదే పంచాయతీలో ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారు స్మృతి ఇరానీ. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ అక్కడి నుండే పోటీ చేసినా, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జాబితా నుండి మాయమైంది స్మృతి ఇరానీ పేరు .

బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశించారు అమేది జిల్లా మెజిస్ట్రేట్. స్మృతి ఇరానీ పేరు ఓటర్ లిస్ట్ లో నుండి మాయంకావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read:రోజు పదివేల అడుగులు నడుస్తున్నారా?

- Advertisement -