క్రికెట్‌లో ఎంతమంది స్టార్ ఆటగాళ్లు ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ ప్రత్యేకమైంది. ఆతను ఆటను ఆస్వాదిస్తూ.. కొట్టే షాట్లు ప్రతి ఒక్కరికి చిరకాలం గుర్తుండిపోతుంది. అందులో సెంచరీ ముందు కొట్టే సిక్స్ వీరూ… కంటే గ్యాలరీలో కూర్చునే సగటు ప్రేక్షకుడికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కానీ వీరూ మాత్రం అవలీలగా కొట్టి సెంచరీ పూర్తి చేసిన సందర్భాలు కొకొల్లలు. అయితే 90ల్లోకి వచ్చిన తర్వాత సెంచరీ చేయాలంటే నేను కనీసం 10బంతులను తీసుకునే వాడిని. అలా బౌలర్లకు పది చాన్సులు ఇచ్చినట్టే… కానీ రెండు బంతులు మాత్రమే తీసుకుంటే నన్ను అడ్డుకోవడానికి వారికి ఉండే ఛాన్స్‌లు రెండు బంతులకు తగ్గించినట్లు అవుతుందని వెల్లడించారు. అలాంటి ఆటగాడు తాజాగా ఓ జాతీయ మీడియాకు సమావేశ సందర్భంలో సచిన్‌తో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
నేను మూడంకెల స్కోరుకు చేరే క్రమంలో బౌండరీలు కొట్టడంపై తనను సచిన్ సున్నితంగా మందలించాడని సెహ్వాగ్ అన్నారు. ఆసీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా సైమన్ కటిచ్ వేసిన బౌలింగ్‌లో సిక్స్ ప్రయత్నించి పెవిలియన్‌కు చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో ఓడిపోయాం. పాక్‌తో జరిగిన ముల్తాన్ టెస్టులోనూ ఆరేడు సిక్స్‌లతో సెంచరీని పూర్తి చేశాను. అప్పుడు సచిన్ నా దగ్గరకు వచ్చి మళ్లీ సిక్స్ కానీ కొట్టావంటే..నిన్ను నేను బ్యాట్‌తో కొడతా అని హెచ్చిరించారు. ఎందుకు అని అడగ్గా…ఆసీస్‌తో జరిగిన టెస్ట్‌లో నేను సిక్స్ కొట్టడం వల్లే ఓడిపోయినట్లు సచిన్ చెప్పారు.
అందుకే ముల్తాన్ టెస్ట్‌లో 120 నుంచి 295పరుగుల వరకు ఒక్క సిక్స్ కొట్టలేదు. అప్పుడు సచిన్ దగ్గరకు వెళ్లి ట్రిపుల్ సెంచరీ కోసం నేను సిక్స్ కొడతా..అని చెప్పా. అంతే సచీన్ నీకేమైనా పిచ్చా…ఇప్పటివరకు ఎవరూ భారత్ తరపున ట్రిపుల్ సెంచరీ కొట్టలేదు అని వివరించారు. దీంతో నేను 295పరుగులు కూడా ఎవరూ కొట్టలేదు అని బదులిచ్చాను. ఆ వెంటనే ముస్తాఖ్ వేసిన బౌలింగ్‌లో సిక్స్ కొట్టి తొలి ట్రిపుల్ సెంచరీ పూర్తిచేశాను. ఆసమయంలో నాకంటే ఎక్కువగా సచిన్ చాలా సంతోషపడ్డారని సెహ్వాగ్ నాటి మధురజ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఇవి కూడా చదవండి…