రాక్షసుడు వంటి క్రైమ్ థ్రిల్లర్‌తో బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స. ఎప్పటికప్పుడు విలక్షణమైన సినిమాలను తెరకెక్కిస్తూ దర్శకుడిగా తనదైన ప్రత్యేకతను ఆయన సొంతం చేసుకున్నారు. ఈయన దర్శకత్వంలో రూపొందుతున్న నెక్ట్స్ మూవీ ‘శివోహం’తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచటానికి సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించటానికి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. దానికి సంబంధించిన వివరాలను మంగళవారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతుంది.
‘మిస్టీరియస్ సాగా గురించి మీకు తెలియజేస్తున్నాం. ఎవరికీ అంతుచిక్కని నిధి, ఓ డెవిల్‌కి మధ్య నడిచే యుద్ధం’ అని మేకర్స్ ప్రకటించటమే కాకుండా అందరిలోనూ క్యూరియాసిటీని కలిగించే పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘శివోహం’ పోస్టర్‌ను గమనిస్తే గుడి ద్వారం మూసి వేయడింది. దాని ముందు ఓ త్రిశూలం కనిపిస్తోంది. అలాగే పూజా సామాగ్రి అంతా కూడా ఉంది. ఇది ఆడియెన్స్‌లో తెలియని ఓ ఆసక్తిని కలిగిస్తోంది. కచ్చితంగా ఎవరికీ తెలియని రహస్యమేదో ఉందనే ఆలోచన కలుగుతుంది.
డైరెక్టర్ రమేష్ వర్మ పెన్మత్సగారు దక్షిణాది అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియోగ్రీన్ వంటి ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్టార్స్ హీరోలతో భారీ బడ్జెట్, మంచి క్వాలిటీ మూవీస్‌ను చేయటంలో స్టూడియో గ్రీన్ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు ఇదే సంస్థ నుంచి ఓ మిస్టీరియస్ థ్రిల్లర్ రూపొందుతుండటం అందరిలోనూ ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచుతోంది.
కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో సంతోష్ డెటాకె సినిమాటోగ్రఫీ అందిస్తోన్న‘శివోహం’ చిత్రానికి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు.
Also Read:ఆలు పాలతో ఎన్ని ఉపయోగాలో..!