ప్రిన్స్‌ ఓటీటీలోకి ఎప్పుడంటే…

70
- Advertisement -

జాతిరత్నాలు ఫేం డైరెక్టర్‌ అనుదీప్ మూడవ చిత్రమైన ప్రిన్స్‌ ద్వారా తమిళంకు పరిచయమయ్యారు. రెమో, డాక్టర్, డాన్ వంటి సినిమాలు తెలుగులోనూ మంచి విజయం అందుకున్న శివకార్తికేయన్ తో తమిళ్‌ తెలుగులో తీసిన ప్రిన్స్‌ సినిమా మంచి విజయంను నమోదు చేసుకుంది. రిలీజ్‌కు ముందు మేకర్స్‌ జరిపిన ప్రమోషన్‌లు, టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై మంచి బజ్‌ తీసుకొచ్చాయి. రోమ్‌-కామ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌21న రిలీజై మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఫుల్‌ రన్‌లో బ్రేక్‌ఈవెన్‌ పూర్తి చేసుకోకుండానే థియేటర్‌లలో నుండి వెళ్ళిపోయింది.

ప్రిన్స్ మూవీ స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ప్రిన్స్ కోసం ఓటీటీ హక్కులను డిస్నీ హాట్ స్టార్ సంస్థ కొనుగోలు చేసుకుంది. కాగా ఈ సినిమా నవంబర్ 25నుండి తెలుగుతో పాటు తమిళంలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శాంతి టాకీస్ బ్యాన‌ర్‌లు సంయుక్తంగా నిర్మించాయి. శివ కార్తికేయన్‌కు జోడీగా మరియా ర్యాబోషప్క నటించింది. సత్యరాజ్‌ కీలకపాత్రలో నటించాడు.

ఇవి కూడా చదవండి..

త్రిపాత్రాభినయం.. కృష్ణ స్టైలే వేరు!

జూ.ఎన్టీఆర్‌@ 22యేళ్లు

కృష్ణ మరణం… ఆ వీడియో వైరల్ !

 

- Advertisement -