మాజీ భామలకు ప్రేరణగా తమన్నా

100
- Advertisement -

హీరోయిన్ గా ఫేడ్ అవుట్ పొజిషన్ లో ఉంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ మధ్య సినిమాలు బాగా తగ్గాయి. అయినా హీరోయిన్ గా తప్ప, మరే ఇతర పాత్రలు వేయను, ఐటమ్ సాంగ్ లు చేయను అని ఇన్నాళ్లు భీష్మించుకొని కూర్చింది. మధ్యలో తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో ఐటమ్ సాంగ్ వచ్చినా తమన్నా నో చెప్పింది. అయితే, గత కొన్ని నెలలుగా టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాల్లో ఒక్క ఛాన్స్ కూడా అందుకోలేకపోయింది ఈ మిల్కీ బ్యూటీ.

చివరకు తమన్నాకి ఐటమ్ సాంగ్స్ కూడా వచ్చేలా కనిపించడం లేదు. సత్యదేవ్ లాంటి చిన్న హీరో సరసన నటించినా ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే.. ఇప్పుడు సోలో హీరోయిన్ కలలు నుంచి తమన్నా దిగి వచ్చింది. ఇన్నాళ్లు తెలుగు సినిమాల్లో… మళ్లీ స్టార్ హీరోయిన్ గా బిజీ అవుతా అంటూ బిల్డప్ ఇచ్చిన తమన్నా.. ఇప్పుడు నిర్ణయం మార్చుకుంది. ఆ మధ్య రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం అడిగితే నో అనేసింది. అలాంటిది ఇప్పుడు ఆ ఐటమ్ సాంగ్ కోసం తమన్నా తెగ తాపత్రయ పడుతుందట.

పైగా ఇక నుంచి ఎలాంటి పాత్ర కైనా రెడీ అని దర్శకులకు, నిర్మాతలకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట. ఈ క్రమంలోనే ఐటమ్ సాంగ్స్ కూడా సానుకూలంగానే వుంది. మొత్తానికి మిల్కీ బ్యూటీ తమన్నా మనసు మార్చుకుని ఐటమ్ సాంగ్ లు చేయడానికి కూడా డిసైడ్ అయింది. ఈ విషయంలో మిగిలిన ముదురు భామలు కూడా తమన్నా ను ఆదర్శంగా తీసుకోవాలి. సాంగ్ కాదు, పాత్ర కాదు, ఏదైనా తమ దగ్గరకు వస్తే.. వదలకుండా ముందుకు సాగడమే ముదురు భామల కెరీర్ కు మంచిది. మొత్తానికి తమన్నా మాజీ భామలకు ప్రేరణగా నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి…

నాడు కిడ్స్‌..నేడు స్టార్స్‌….

2023లో బాలీవుడ్‌ స్టార్ కిడ్స్‌ ఎంట్రీ…

గిల్డ్ మీటింగ్…అట్టర్ ఫ్లాప్

- Advertisement -