రివ్యూ: సీతారామం

171
sita ramaam
- Advertisement -

వైజయంతి మూవీస్ బ్యానర్‌లో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ్, మలయాళంలో ఒకేసారి ఇవాళ ప్రేక్షకుల ముందుకురాగా విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొనగా ఆ అంచనాలను దుల్కర్ అందుకున్నాడా లేదా చూద్దాం..

కథ:

లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్) ఇండియన్ ఆర్మీలో పనిచేసి తర్వాత ఆల్ ఇండియా రేడియోలో చేరుతాడు. రామ్ అనాథ. అయితే అతడి మాటతీరుతో ప్రజల మనసు గెలుచుకుంటారు. ఈ క్రమంలో కొంతమంది అతడికి లేఖలు రాస్తారు. ఇందులో ఒక అమ్మాయి సీతా మహాలక్ష్మి (మృణాల్ ఠాకూర్), రామ్‌ని తన భర్తగా సంబోధిస్తుంది. సీన్ కట్ చేస్తే సీతా మహాలక్ష్మి ఎవరు? కథ ఏంటీ? చివరకు ఎలా సుఖాంతం అయిందనేదే సినిమా స్టోరీ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్‌ దుల్కర్,మృణాల్ నటన,సెకండాఫ్,క్లైమాక్స్‌, సాంకేతిక విభాగం. ఇక ముఖ్యంగా తనపాత్రలో ఒదిగిపోయాడు దుల్కర్‌. రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో చక్కగా నటించాడు. ఇక దుల్కర్‌తో పోటీపడి నటించింది మృణాల్. ఆ కాలపు సంప్రదాయ వస్త్రధారణలో చాలా అందంగా మరియు అద్భుతంగా కనిపించింది. ఇక సినిమాకు మరింత గ్లామర్ తెచ్చింది రష్మికా. మిగితా పాత్రల్లో వెన్నెల కిషోర్ ,మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రియదర్శి, రాహుల్ రవీంద్రన్ తమ పరిధి మేరకు అలరించారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్‌ ఫస్టాఫ్ సాగదీత,కామెడీ ట్రాక్ లేకపోవడం. డజనుకు పైగా ప్రముఖ నటీనటులు ఉన్న వారికి ఎక్కువ స్క్రీన్ సమయం లేకపోవడం మైనస్‌.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. విశాల్ చంద్రశేఖర్ పాటలు విజువల్‌గా ఆకట్టుకున్నాయి .బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. పిఎస్ వినోద్ కెమెరా పనితనం క్రిస్టల్ క్లియర్. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించారు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

తీర్పు:

హను రాఘవపూడి తెరకెక్కించి ఫీల్ గుడ్ లవ్‌ స్టోరీ సీతా రామం. ఫస్టాఫ్ సంగతి పక్కన పెడితే సెకండాఫ్‌ అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. రహస్య మిషన్ తర్వాత జరిగే సంఘటనల తర్వాత వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా, భావోద్వేగాలతో కట్టిపడేస్తాయి. ఓవరాల్‌గా అందమైన ప్రేమకావ్యం సీతా రామం.

విడుదల తేదీ: 05/08/2022
రేటింగ్:2.75/5
నటీనటులు: దుల్కర్, మృణాళ్ ఠాకూర్
సంగీతం:విశాల్ చంద్రశేఖర్
నిర్మాత:అశ్వినీదత్
దర్శకత్వం:హను రాఘవపూడి

- Advertisement -