కేటీఆర్‌ను ఓడించే దమ్ము ఉందా?

2
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక మహిళ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం పంపిణీ చేసిన ‘ఇందిరమ్మ చీర’ను ధరించి మీడియా ముందుకు వచ్చిన ఆమె, సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు వేసిన సెటైర్లు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆ మహిళ ఆరోపించారు.ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క గ్యారెంటీని సరిగ్గా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తున్నారు?” అని ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి కేవలం పదవి అనుభవించడం కోసం, అధికారం చలాయించడం కోసమే గెలిచారని, ప్రజల సంక్షేమం ఆయనకు పట్టడం లేదని మండిపడ్డారు.

సిరిసిల్ల ప్రాంత ప్రజల తాగు, సాగునీటి అవసరాలకు రావాల్సిన నీళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు అమ్ముకుంటోందని సదరు మహిళ ఆరోపించారు. స్థానిక రైతులను, ప్రజలను ఎండబెట్టి నీళ్లను వ్యాపారం చేయడం దారుణమని ధ్వజమెత్తారు.సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కున్న ప్రజాదరణను ఎవరూ తగ్గింలేరని ఆ మహిళ ధీమా వ్యక్తం చేశారు.

Also Read:బ్యాంకాక్‌ను ముంచెత్తిన వర్షాలు

సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడించే దమ్ము, ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సిరిసిల్ల గడ్డపై అడుగుపెడితే ప్రజలు ఊరుకోరు. రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తే మహిళలంతా కలిసి చెప్పుల దండలు వేసి బుద్ధి చెప్తారు….ప్రభుత్వ పథకాల పేరుతో మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

 

- Advertisement -