బడుల మూత..బార్ల మోత!

9
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ, వీధి వీధికీ బార్లకు, వైన్ షాపులకు అనుమతులివ్వడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అందిస్తున్న పాలన “ప్రజా పాలన” కాదని, కేవలం ఒక “తుగ్లక్ పాలన” అని విమర్శించారు.

రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతులు లేకపోవడంతో వేలాది ప్రభుత్వ బడులు మూతపడే స్థితికి వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాల్సిన బడుల్లో విద్యావాలంటీర్లను నియమించకుండా, పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం కారణమవుతోందని అన్నారు.

మరోవైపు రాష్ట్రాన్ని మద్యం బారిన పడేసేలా ప్రభుత్వం ఆదాయమే పరమావధిగా వీధికొక బార్, క్వార్టర్ షాపులను పెంచుకుంటూ పోతోందని విమర్శించారు.ఒకవైపు విద్యను అందించే సరస్వతీ నిలయాలైన పాఠశాలలను మూసివేస్తూ.. మరోవైపు ఊరూరా మద్యం ఏరులై పారేలా బార్లు తెరుస్తున్నారు. బడులు మూయడం, బార్లు తెరవడం.. ఇదేనా మీ ప్రజా పాలన అంటే? ఇది పక్కా తుగ్లక్ పాలన కాక మరేమిటి?” అని కేటీఆర్ నిలదీశారు.

 

Also Read:పొంగులేటిపై ఈడీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

- Advertisement -