అమ్మా మాస్క్ కట్టుకోండి,అయ్యా మాస్క్ కట్టుకోండి దయచేసి దూరం దూరం గా ఉండండి అంటూ ఓ పోలీస్ కానిస్టేబుల్ కరోన వ్యాధి బారిన పడకుండా ఓ విన్నూత్న తరహాలో ప్రచారం నిర్వహించాడు.
వివరాల్లోకి వెళితే….రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రజలు కరోన వైరస్ బారిన పడకుండా,దేశం పట్ల తనకున్న అభిమానాన్ని ఓ విన్నూత్న రీతిలో ప్రచారం చేశాడు.
శ్రీనివాస్ తన డబ్బులతో ఒక సౌండ్ బాక్స్ ని కొనుగోలు చేసి దానిని ఒక మిలటరీ బ్యాగ్ వలె తయారు చేసుకొని భుజాన వేసుకొని సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో పాదయాత్రగా తిరుగుతూ మైక్ ద్వారా ప్రచారం చేస్తూ కరోన వ్యాధి గురించి అప్రమత్తంగా వుండాలని సూచించాడు.అదే విధంగా పట్టణంలో జన సందోహం ఎక్కువగా ఉండే కూరగాయల మార్కెట్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ తానే స్వయంగా మాస్క్ లను అందచేసాడు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పాదయాత్రగా తిరుగుతూ వాహన దారులను,పాదాచారులను ఆపి అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని దండం పెడుతూ బ్రతిమిలాడాడు.
తన ఈ ప్రచారం పట్ల కొంత మంది ప్రజలైన మారి బయటకు రాకుండా ఉండి,పరిశుభ్రత పాటించి,అధికారులు సూచించింది విని కరోన వ్యాధి బారిన పడకుండా ఉంటారని అందుకే తన డ్యూటీ అయిన తరువాత ఇలా ప్రత్యేకంగా ఇది ఒక డ్యూటీ లాగా చేస్తూ అవగాహన కల్పిస్తున్నానని దీని ద్వారా కొంత మంది అయిన మారుతారని ఆశా భావాన్ని వ్యక్తం చేశాడు.