సీఎం కేసీఆర్‌పై బండి సంజ‌య్ ప్ర‌శంస‌లు

263
bandi sanjay
- Advertisement -

కరోనా వైరస్ క‌ట్ట‌డి చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ప్ర‌శంస‌లు గుప్పించారు.

క‌రోనా వ్యాప్తిని అరికట్టేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలకు తెలంగాణ బీజేపీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం అయ్యేలా చూడాలని సీఎంను కోరారు.

లాక్‌డౌన్‌ పరిస్థితుల దృష్ట్యా కొంతమంది స్వలాభం కోసం నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను ఒక్కసారిగా పెంచేశారని ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎం కేసీఆర్‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

- Advertisement -