తండ్రైన సింగర్ రేవంత్..

162
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 89 రోజులు పూర్తి చేసుకుంది. మరికొద్దిరోజుల్లో బిగ్ బాస్ ముగియనుండగా హౌస్‌లోకి వచ్చే ముందే సింగర్ రేవంత భార్య గర్భవతి. ఇక హౌస్‌లో ఉన్న ప్రతిక్షణం ఇదే విషయాన్ని గుర్తుచేసుకుని తెగ బాధపడిపోయాడు రేవంత్.

ఇక రేవంత్‌కి గుడ్ న్యూస్ కానీ ఇది అతడికి తెలియదు. రేవంత్ భార్య అన్విత డిసెంబర్ 1న పండంటి పాపకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా అన్విత, రేవంత్ సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేశారు.

మరి బిగ్ బాస్ ఈ విషయం రేవంత్ కి ఎప్పుడు చెప్తాడు, చెప్తే రేవంత్ ఎలా ఫీల్ అవుతాడు, మళ్ళీ కాల్ లాంటిది ఏమన్నా అరేంజ్ చేస్తాడా చూడాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్వితని వివాహం చేసుకున్నారు రేవంత్.

ఇవి కూడా చదవండి..

కడుపుబ్బరం తగ్గించేదుకు…

- Advertisement -