తక్కువ ధరకే 5G ఫోన్!

229
- Advertisement -

ప్రస్తుతం దేశంలో 5G సేవలు విస్తృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగ్గజ కంపెనీలతో పాటు చిన్న కంపెనీలు కూడా 5G ఫోన్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. దీంతో అదిరే ఫీచర్స్‌తో తక్కువ ధరకే 5G ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో భారత్‌లో అద్భుతమైన ఫీచర్లతో 5జీ ఫోన్‌ను ఇన్ఫినిక్స్ లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీతో పాటు ఇన్ఫినిక్స్ హాట్ 20 ప్లేను విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ 20జీలో 50 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండగా, హాట్ 20 ప్లేలో 13 ఎంపీ డ్యూటల్ రియర్ కెమెరా ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ 4జీబీ ర్యామ్+64జీబీ ర్యామ్ స్టోరేజీ ధర రూ.11,999. స్పేస్ బ్లూ, బ్లాస్టర్ గ్రీన్, రేసింగ్ బ్లాక్ కలర్లు ఉన్నాయి. ఇన్ఫినిక్స్ హాట్ 20 ప్లే 4జీబీ ర్యామ్+64జీబీ వేరియంట్ ధర రూ. 8,999 మాత్రమే. ఇందులో లూనా బ్లూ, అరోరా గ్రీన్, రేసింగ్ బ్లాక్ కలర్ వేరియంట్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ డిసెంబరు 9 నుంచి, ఇన్ఫినిక్స్ హాటల్ 20 ప్లే ఈ నెల 6 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -