పాట పాడాలంటే నైట్ నాతో ఉండాలి అన్నాడుః సింగర్ ప్రణవి

439
singer pranavi
- Advertisement -

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం కొద్ది రోజులు రచ్చ చేసిన విసయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి రోజు ఎవరో ఒకరు తమకు జరిగిన అనుభవాలను పలు ఇంటర్యూలలో షేర్ చేసుకుంటున్నారు. ఇది ఇక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా ఉంది. అయితే క్యాస్టింగ్ కౌచ్ అనేది హీరోయిన్స్ , క్యారెక్టర్ ఆర్టీస్ట్ లకు మాత్రమే కాకుండా సింగర్స్ ను కూడా వెంటాడుతంది. తాజాగా ఓఇంటర్యూలో పాల్గోన్న సింగర్ ప్రణవి కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది.

తాను చిన్న వయసులో ఉన్నపుడు పాటలు పాడుతుండేదానినని చెప్పింది. ఒక రోజు నేను రికార్డింగ్ స్టూడియోలో ఉండగా..ఒక డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి నువ్ నాసినిమాలో పాట పాడాలి అనుకుంటే ఒక నైట్ నాతో గడపాలి అని ఓ దర్శకుడు నాతో చెప్పాడని.. అయితే నేను వెంటనే నీ వయసు ఏంటీ..నా వయసు ఏంటీ ? చెప్పుతీసుకుని కొడతా అని సమాధానం ఇచ్చినట్లు తెలిపింది సింగర్ ప్రణవి.

అప్పడు తాను ఇంటర్మీడియట్ చదువుతున్నానని..ఆ దర్శకుడికి అప్పుడే కొత్తగా పెళ్లైందని చెప్పింది. అప్పటినుండి తను ఆఫర్స్ కోసం వెళ్లినప్పుడు పరిస్థితిని అర్ధం చేసుకొని అక్కడ నుండి వచ్చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. రఘు మాస్టర్ తో పెళ్లైన తర్వాత తన జోలికి ఎవరూ రాలేదని చెప్పుకొచ్చింది సింగర్ ప్రణవి.

- Advertisement -