బిగ్ బాస్ 3 టైటిల్ ఆ ఇద్దరికేః గీతా మాధురి

382
Geetha Maduri
- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది. ఇంకో మూడు రోజుల్లో సీజన్ 3 విజేత ఎవరో తేలనుంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు కంటెస్టెంట్లు శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్‌ సందేశ్, రాహుల్ లు ఉన్నారు. చివరి వారం కావడంతో వీరికి పెద్దగా టాస్క్ లు ఇవ్వకుండా వాళ్ల జర్నిని చూపిస్తున్నారు బిగ్ బాస్. ఫైనల్ కోసం ప్రధానంగా రాహుల్ , శ్రీముఖి మధ్య గట్టి పోటీ ఉందని చెప్పుకోవాలి. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ కు చేరే అవకాశం ఉంది. బిగ్ బాస్ 3 టైటిల్ ఎవరిది అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది.

అందులో చాలా మంది రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి వైపు మొగ్గు చూపుతున్నారు. వారికి సపోర్ట్ చేయాలంటూ కామెంట్లు, పోస్టులు, ఫోటోలు, వీడియోలతో హోరెత్తిస్తున్నారు. అయితే బిగ్ బాస్ 2 రన్నరప్ గీతా మాధురి బిగ్ బాస్ 3 విన్నర్ ఎవరో చెప్పేసింది. శ్రీముఖి, రాహుల్ లతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తు ఇద్దిరికి ఆల్ ద బెస్ట్ చెప్పింది గీతా మాధురి. ఈ ఇద్దరికి నా మద్దతు ఉంటుందని వీరిద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఒకే అంటూ ట్వీట్ చేసింది.

- Advertisement -