జూ.ఎన్టీఆర్‌కి అవమానం…!

295
- Advertisement -

టాలీవుడ్‌లో తనదైన ముద్రవేసుకున్న మహానటుడు నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావును అందరూ అన్నా ఎన్టీఆర్ అని పిలుస్తారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సమయంలో ఆయన కొడుకులు ఇద్దరు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా కంటిన్యూ అవుతున్నారు. హరికృష్ణ మాత్రం సినిమాలకు పులిస్టాప్‌ పెట్టేసారు.

హరికృష్ణ వారసులుగా కళ్యాన్ రామ్, జూనియర్‌ ఎన్టీఆర్ లు టాలీవుడ్‌కి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కళ్యాణ్‌రామ్‌కు పెద్ద హిట్లు లేకపోవడంతో అడపదడప సినిమాలు తీస్తు వస్తున్నాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్‌ మాత్రం ప్రస్తుతం సినిమాల్లో జోష్‌ పెంచాడు. ఇటీవలే కొరటల శివ దర్శకత్వంలో తీసిన జనతాగ్యారేజ్‌ సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. గత సంవత్సరం నుంచి వరుస హిట్స్ తోముందుకు వెళ్తున్నాడు ఈ యంగ్‌ హీరో.

Singam' Director Says Who Is NTR

అయితే యంగ్‌ హీరో ఎన్టీఆర్ కి ఘోరమైన అవమానం జరిగింది….తమిళ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు హ‌రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియదని అన్నారు. ద‌క్షిణాది ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ క‌లిగి ఉన్న‌ క‌థానాయ‌కుల్లో ఒక‌రు యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్. ఇటీవ‌లే విడుద‌లైన ‘జ‌న‌తాగ్యారేజ్‌’తో ఎన్టీఆర్ కి తమిళ,మళియాలం, తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Singam' Director Says Who Is NTR

సింగం సినిమాని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు హ‌రి…యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడ‌నే ప్ర‌చారం అప్పట్లో జోరుగా జ‌రిగింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ అటు కోలీవుడ్‌లో, హ‌రి ఇటు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని అంతా అనుకున్నారు.. దీంతో ఇద్ద‌రూ క‌లిసి ఓ ప్రాజెక్ట్ చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ని అప్పట్లో టాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. దీంతో అసలు విషయం తెలుసుకోవాలని విలేకర్లు ఈ ఇంటర్వ్యూలో తెలుగులో ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నార‌ట క‌దా.. నిజ‌మేనా? అని ప్ర‌శ్నించారు.

Singam' Director Says Who Is NTR

దీంతో అందరి వంక ఆశ్చర్యంగా చూసిన దర్శకుడు హరి అసలు ఎన్టీఆర్ ఎవరు ఆయన నాకు తెలియదు అని అన్నారు. దాంతో విలేక‌ర్లంతా షాక్ తిన్నారు. హ‌రికి నిజంగానే తెలియ‌దా లేక కావాల‌నే అన్నాడా? అని ఆశ్చయర్యపోతున్నారు సినీ జనం. హరి వ్యాఖ్యలపై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర స్ధాయిలో మండిప‌డుతున్నారు.

- Advertisement -