జనసేన..నోట్ల పంపిణీ

205
janasena
- Advertisement -

పెద్ద నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. పాత నోట్లు చెల్లక..కొత్త నోట్లు అందుబాటులో లేక మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో పాత నోట్లు రద్దు ప్రభావం ఎక్కువగా ఉంది. పాత నోట్లు చెల్లకపోవడంతో..సమాయానికి అందుబాటులో లేక వైద్యం అందక కొంతమంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చి నగదు కోసం ఇబ్బంది పడుతున్న రోగులకు జనసేన కార్యకర్తలు కాస్త ఆదుకునే ప్రయత్నం చేశారు. పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రికి నిత్యం ఎందరో రోగులు వస్తుంటారు. పెద్దనోట్ల రద్దుతో చాలామంది చిల్లర కోసం పాట్లు పడుతున్నారు. దీనిని గుర్తించిన జనసేన కార్యకర్తలు.. నిమ్స్‌ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు ఎదురుగా ఉన్న విశ్రాంతిశాలలో పేద రోగుల కుటుంబ సభ్యులకు రూ.500, రూ.1000 నోట్లకు చిల్లర ఇచ్చి ఆదుకున్నారు.

Jana Sena activists

ఈ విధంగా సుమారు రూ.25వేల వరకు చిన్న నోట్లు పంపిణీ చేశారు. నోట్లు మార్చుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. తెచ్చిన చిన్ననోట్లు అయిపోవడంతో మళ్లీ వస్తామని కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే నోట్ల మార్పిడి వల్ల ఆస్పత్రి ప్రాంగణంలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని.. అందువల్ల ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆస్పత్రి వర్గాలు జనసేన కార్యకర్తలకు సూచించాయి.

- Advertisement -