టూరిజం శాఖమంత్రిగా సిద్దూ…

202
Sidhu to take charge Tourism & Cultural Affairs Ministry
- Advertisement -

పంజాబ్ లో 117సీట్లకు గాను 77సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇక ఇవాళ ఉదయం పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్‌తో సహా 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అమరీందర్ కేబినెట్‌లో సిద్ధూకు స్థానిక పరిపాలన, పర్యాటక, సాంస్కృతిక శాఖల బాధ్యతలను అప్పగించారు. మరో నేత మన్ ప్రీత్ బాదల్ ఆర్థికశాఖ, సీనియర్ నేత బ్రాహ్మ్ మొహిందర్ కు ఆరోగ్య శాఖ లను కేటాయించారు.

ఇక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వేదికపై ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పాదాలకు నమస్కరించారు. వయసులో, రాజకీయాల్లో తన కంటే సీనియర్ అయిన అమరీందర్ కు నమస్కరించి ఆయన పట్ల గౌరవం ప్రదర్శించారు. వ్యక్తిగత లక్ష్యాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్న సందేశాన్ని తన చర్య ద్వారా సిద్దూ అందించారు. కార్యక్రమానికి హాజరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సిద్ధూను అభినందన పూర్వకంగా చేశారు.

మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమరీందర్ సింగ్ కు ట్విటర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. పంజాబ్ ను అభివృద్ధి పథంలో నడపాలని ఆకాంక్షించారు. తన కేబినెట్ లో ప్రకాశ్ సింగ్ బాదల్ మేనల్లుడి మన్ ప్రీత్ సింగ్ బాదల్ కు అమరీందర్ చోటు కల్పించారు. అకాలీదళ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్ ప్రీత్ తర్వాత ప్రకాశ్ సింగ్ తో విబేధించి బయటకు వచ్చారు. తర్వాత పంజాబ్ పీపుల్స్ పార్టీని స్థాపించారు. ఈ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో తాజాగా ఆయనకు మంత్రి పదవి దక్కింది.

- Advertisement -