- Advertisement -
5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్,మణిపూర్,ఉత్తరాఖండ్‌లో బీజేపీ విజయం సాధించగా పంజాబ్‌లో ఆప్ విజయకేతనం ఎగురవేసింది. ఇక గోవాలో కాంగ్రెస్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది.
ఇక 5ఈ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్,నవజ్యోత్ సిద్దూ ఇద్దరు ఓటమి పాలయ్యారు.తన ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు సిద్ధూ.
ఇక గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ ఓటమిపాలయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఉత్పల్ పారికర్.. పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి ఏబీపీ మజ్హా చేతిలో 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- Advertisement -