రాహుల్ సమావేశానికి సిద్ధరామయ్య డుమ్మా!

2
- Advertisement -

కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన టీ సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరుకావడం లేదని తెలుస్తోంది. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున ఈ సమావేశానికి రాలేనని ఆయన వెల్లడించినట్లు సమాచారం.

నవంబర్ 6న హసన్ జిల్లాలో తనకు ఇప్పటికే కొన్ని అధికారిక కార్యక్రమాలు ఖరారయ్యాయని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ కారణంగా రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకావడం సాధ్యం కాదని తెలిపారు.

కాగా, కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నాయకత్వానికి సంబంధించిన చర్చలు కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన సమావేశానికి సిద్ధరామయ్య గైర్హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:ఆసీస్ కన్సల్టెంట్‌ కోచ్‌గా మైక్ హస్సీ

రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలు, పార్టీ నేతల మధ్య సమన్వయం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై అధిష్ఠానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే ముందస్తు కార్యక్రమాల కారణంగానే సమావేశానికి హాజరుకావడం లేదని సిద్ధరామయ్య చెబుతున్నారు.

- Advertisement -