పూరీకి డ్రగ్స్‌ ఇచ్చింది శ్యామ్ కె నాయుడే…!

232
Shyam K Naidu reveal about Puri
- Advertisement -

డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. తొలిరోజు విచారణలో దర్శకుడు పూరిని విచారించిన అధికారులు రెండో రోజు సినిమాటోగ్రఫర్ శ్యామ్‌ కె నాయుడిని విచారించారు. వీరి నుంచి అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. అయితే తొలి నుంచి పూరి జగన్నాథ్‌ ఇండస్ట్రీలోని వారికి డ్రగ్స్ అలవాటు చేశాడనే వార్త ప్రచారంలో ఉండగా పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయట.

తనకు సిగిరెట్ అలవాటే లేదు… ఇక డ్రగ్స్ అంటే ఏమిటో కూడా రుచి చూడలేదు, అసలు ఎప్పుడూ చూడనే లేదంటూ మీడియా ముందు శ్యామ్ కే నాయుడు చెప్పిన మాటలు అన్ని అబద్దాలేనట. పూరీ జగన్నాథ్ కు డ్రగ్స్ చేరవేసింది శ్యామ్ కే నాయుడేనని సిట్ అధికారులు చెబుతున్నారు.   పూరీ జగన్నాథ్ ఇంటర్నేషనల్ సిమ్ ద్వారా గంటల తరబడి ఛాట్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు.

అయితే దీనిపై పూరీని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్న పూరీ జగన్నాథ్… సిమ్ చూపించి, ఛాట్ వివరాలు చూపించే సరికి తప్పు అంగీకరించినట్టు తెలుస్తోంది. బ్యాంకాక్ నుంచి పూరీ జగన్నాథ్ కెల్విన్ తో గంటల తరబడి చాట్ చేశాడు. ఆ సిమ్ ద్వారా గ్రూప్ కూడా క్రియేట్ చేసినట్టు, దాని ద్వారా డ్రగ్స్ అమ్మకాలు సాగించినట్టు తెలుస్తోంది. అయితే విదేశాల నుంచి వచ్చే పార్సిల్స్ ను పూరీకి అందించానే తప్ప, అందులో ఏముందో కూడా తనకు తెలియదని శ్యామ్ కే నాయుడు చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక మూడో రోజు డ్రగ్స్ వ్యవహారంపై సుబ్బరాజును కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్  అలవాటు, కెల్విన్‌తో పరిచయం, ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి..?ఎవరు అందించారు…? అనే ప్రశ్నలతో  పూరి-శ్యామ్ వ్యవహారంలో సుబ్బరాజు పాత్రపై కూడా అధికారులు ఆరా తీయనున్నారు.

- Advertisement -