రివ్యూ : ఫిదా

307
Review Fidaa
- Advertisement -

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టెనర్ ‘ఫిదా’. ఈ సూపర్ కాంబినేషన్‌కు తోడు దిల్ రాజు బేనర్ నుండి వస్తున్న సినిమా కావడం, ట్రైలర్స్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంత భారీ అంచనాల మధ్య విడుదలైన ఫిదాతో వరుణ్,శేఖర్ కమ్ముల ఆకట్టుకున్నారా…?సాయి పల్లవికి ప్రేమమ్‌ తర్వాత అంతటి బ్రేక్ ఇచ్చిందా..? లేదా చూద్దాం.

కథ:

వరుణ్ తేజ్ అమెరికాలో అన్నతో పాటు ఉంటూ మెడిసిన్ చేస్తుంటాడు. వరుణ్ అన్నయ్య (రాజ్) పెళ్లి చూపుల కోసం తెలంగాణలోని బాన్సువాడలో అమ్మాయిని చూడటానికి వెళ్తాడు. అలా  ఇండియాకి వచ్చిన వరుణ్ కి పెళ్లి కూతురి చెల్లెలు భానుమతి(సాయి పల్లవి)తో స్నేహం ఏర్పడుతుంది. ఈ పెళ్లి సందడిలో వరుణ్, భానుమతిల స్నేహం కాస్తా ప్రేమకి దారి తీస్తుంది. తన ప్రేమని వరుణ్ కి తెలిపే లోగా అనుకోని సంఘటన వల్ల చెప్పలేకపోతుంది. అమెరికా వెళ్లిన వరుణ్ తన ప్రేమని భానుమతికి తెలియచేస్తాడు. అయితే భానుమతి వరుణ్ ప్రేమని తిరస్కరిస్తుంది. వరుణ్ ని ప్రేమించిన భానుమతి తన ప్రేమని ఎందుకు కాదంది ? చివరకి ఇద్దరు కలుస్తార లేదా ? అనేది తెర మీద  చూడాల్సిందే …..

 Review Fidaa
ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్  వరుణ్ తేజ్, సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ,శేఖర్ కమ్ముల స్క్రీన్ ప్లే, కథ, కామెడీ, సినిమాటోగ్రఫీ. ఎన్నారై యువకుడి పాత్రలో, సాఫ్ట్ నేచర్‌ క్యారెక్టర్లో వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్. ఇంతకముందు సినిమాలతో పోలిస్తే వరుణ్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. ఇక  తెలంగాణ అమ్మాయి పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయింది. ఆమె తన పాత్రలో నటించడం కాకుండా జీవించింది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. మిగితా వారు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. శేఖర్ కమ్ముల తనదైన ఎమోషనల్ సీన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ స్లో నేరేషన్. సెకండాఫ్ చాలా స్లోగా, బోరింగా అనిపిస్తుంది.  సినిమాలో ఎక్కువ సీన్లు హీరో, హీరోయిన్ మధ్యే జరుగుతాయి.

 Review Fidaa
సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడతాయి. శక్తికాంత్ మ్యూజిక్, విజయ్ సి కుమార్ పిక్చరైజేషన్, బ్యూటిఫుల్ లొకేషన్స్, డైలాగులు ప్రేక్షకలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. శేఖర్ కమ్ముల స్క్రీన్ ప్లే సినిమాకే హైలైట్. దిల్ రాజు నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

తీర్పు:

చాలాకాలం గ్యాప్ తర్వాత ఫిదాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శేఖర్ కమ్ముల తనదైన మ్యాజిక్ చేశాడు. కథ, ఆకట్టుకునే సన్నివేశాలు, వరుణ్ తేజ్,సాయి పల్లవి నటన సినిమాకు ప్లస్ కాగా స్లో నేరేషన్ సినిమాకు మైనస్.  మొత్తంగా శేఖర్ కమ్ముల మార్క్‌  ప్రేక్షకుడిని `ఫిదా` చేసే ఓ మంచి ప్రేమ‌క‌థ‌.

విడుదల తేదీ: 21/07/2017
రేటింగ్ : 3.5/5
నటీ నటులు : వరుణ్ తేజ్, సాయి పల్లవి
సంగీతం : శక్తి కాంత్
నిర్మాత : దిల్ రాజు
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : శేఖర్ కమ్ముల

- Advertisement -