నాకు కాస్త ప్రేమ కావాలి-శ్రుతి హాసన్

514
shruti-hassan
- Advertisement -

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ తనయ శ్రుతి హాసన్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.‘కాటమరాయుడు’ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చిన ఈ అమ్మడు మ్యూజిక్‌ ఆల్బమ్‌లు, షోలతో బిజీగా గడిపింది. అయితే ఈ క్రమంలో కాస్త బరువెక్కాంది. ఆమె ఫొటోల్ని చూసిన నెటిజన్లు విమర్శిస్తూ కామెంట్లు చేశారు. తాజాగా శ్రుతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బరువెక్కిన సమయంలో ఎదుర్కొన్న విమర్శల గురించి వివరించింది.

shruti-hassan

తనకు పెళ్లై పోయిందని, అందుకే లావెక్కానని, ఇలా తనపై నెటిజన్లు చాలా విమర్శలు గుప్పించారని పేర్కొంది. ఆ కామెంట్లు తనను చాలా బాధించేవని కానీ తన అనారోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలియదు కదా అని సరిపెట్టుకున్నానని తెలిపింది.

తనను తాను పట్టించుకునేంత తీరిక గత పదేళ్లలో లేదని.. ఇలాంటి పరిస్థితి ప్రతి వ్యక్తికీ వస్తుందన్నారు. ఇంత కాలం పాటు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని కానీ ప్రస్తుతం తనను అవేమీ బాధించట్లేదని శ్రుతి తెలిపింది. తనకు కాస్త ప్రేమ, గౌరవం, ప్రశాంతత కావాలని తెలిపింది. ఇక శ్రుతి చాలా రోజుల తర్వాత ఇటీవల తమిళంలో హీరో విజయ్‌ సేతుపతి సినిమాకు సంతకం చేసింది. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

- Advertisement -