ప‌వ‌న్ క‌ళ్యాన్ కు షాకిచ్చిన శృతిహాస‌న్

174
Shruti_Haasan
- Advertisement -

ప‌‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా గ్యాప్ త‌ర్వాత సినిమాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో భారీ విజ‌యం సాధించిన పింక్ రిమేక్ మూవీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌‌టిస్తున్నారు. యువ దర్శ‌కుడు వేణు శ్రీరామ్ ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ నిర్మ‌‌త దిల్ రాజు, బోనీ క‌పూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా చాలా రోజుల క్రితం ఈమూవీ షూటింగ్ ప్రారంభించారు.

ఇప్ప‌టికే స‌గం వ‌ర‌కు చిత్రిక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈచిత్రం ఫ‌స్ట్ లుక్ ను ఇటివ‌లే విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్. ఈమూవీలో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతి హాస‌న్ ను తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఉన్న స‌మాచారం మేర‌కు శృతి హాస‌న్ వ‌కీల్ సాబ్ మూవీలో న‌టించ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న శృతి హాస‌న్ ఇటివ‌లే వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

అటు సింగ‌ర్ గా, మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా, యాక్ట‌ర్ గా పుల్ బిజిగా ఉన్న శృతిహాస‌న్ ప‌వ‌న్ మూవీని రిజెక్ట్ చేసిన‌ట్లు తెలుస్తుంది. వ‌కీల్ సాబ్ లో శృతి హాస‌న్ స్ధానంలో ఎవ‌రిని తీసుకుంటారో చూడాలి. కాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్, శృతిహాస‌న్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. అలాగే వీరిద్ద‌రి కాంబినేష‌న్ వ‌స్తున్న మూడో సినిమా కూడా హిట్ అవుతుంద‌ని అనుకున్న ప‌వ‌న్ అభిమానుల‌కు నిరాశే ఎదురైంది.

- Advertisement -